- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DEO : పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి..
by Batti.Sumithra |
ధర్మారంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా విద్యాధికారి ఎన్.వి దుర్గాప్రసాద్ శనివారం సందర్శించారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ధర్మారంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా విద్యాధికారి ఎన్.వి దుర్గాప్రసాద్ శనివారం సందర్శించారు. పాఠశాలలో వివిధ తరగతులలో చదువుతున్న విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. పాఠశాల తరగతి గదుల్లో అధ్యాపకుల బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సంబంధిత అంశాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు బోధన అందించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, విద్యార్థులందరూ చక్కగా చదువుకునేలా ప్రోత్సహించాలని డీఈఓ దుర్గాప్రసాద్ పాఠశాల అధ్యాపకులకు సూచించారు. పాఠశాలల సమస్యలను, విద్యార్థుల హాజరు తీరును అడిగి తెలుసుకున్నారు.
Next Story






