- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Effect : కదిలిన జిల్లా యంత్రాంగం..
by Batti.Sumithra |
శనివారం దిశ దిన పత్రికలో ప్రచురితం అయిన 'విద్యార్థులకు కారం మెతుకులే దిక్కు ' అనే శీర్షికకు జిల్లా యంత్రాంగం కదలి వచ్చింది.

X
దిశ, కోటగిరి : శనివారం దిశ దిన పత్రికలో ప్రచురితం అయిన 'విద్యార్థులకు కారం మెతుకులే దిక్కు ' అనే శీర్షికకు జిల్లా యంత్రాంగం కదలి వచ్చింది. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ కొత్తపల్లి పాఠశాలను సందర్శించి. ఉపాధ్యాయులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో పత్రికలో వచ్చిన కథనంపై విచారించారు.
కారంపొడితో భోజనం పెట్టిన విషయం వాస్తవమైనా మధ్యాహ్నం భోజన నిర్వాహకులు ఒప్పుకోవడంతో వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొమారు ఇలాంటి తప్పిదాలు జరిగితే మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట తహశీల్దార్ గంగాధర్, ఎంఈఓ నాగనాథ్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, గణేష్, కిషన్ రమేష్, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు ఉన్నారు.
Next Story






