దిశ ఎఫెక్ట్.. గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల

by Ratna Kumari |   (  Updated:2025-12-31 05:46:41  IST  )

దిశ‌, ఆలూర్ : ఆలూరు మండలంలో రైతులు ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్యపై దిశ పత్రికలో ప్రచురితమైన క‌థ‌నానికి అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్..  గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల
X

దిశ‌, ఆలూర్ : ఆలూరు మండలంలో రైతులు ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్యపై దిశ పత్రికలో ప్రచురితమైన క‌థ‌నానికి అధికారులు స్పందించారు. గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయాలని ఆలూరు మండలం నాయకులు, ఆలూర్ సర్పంచ్ విజయ్, వీడీసీ అధ్యక్షులు సూర్య, ఇతర నాయకులు నిన్న జాయింట్ కలెక్టర్‌కు రైతుల తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో దిశ పత్రికలో వచ్చిన కథనాన్ని గమనించిన జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ వెంటనే స్పందించి.. సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండల రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో దిశ పత్రిక కీలక పాత్ర పోషించిందని స్థానికులు ప్రశంసించారు. రైతుల పక్షాన నిలబడి సమస్యకు పరిష్కారం చూపించిన దిశ పత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story