దిశ ఎఫెక్ట్.. దేగాంలో కల్వర్ట్ నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు

by Kodari Anjali |

దెబ్బతిన్న కల్వర్ట్ కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యకు చెక్ పడింది.

దిశ ఎఫెక్ట్.. దేగాంలో కల్వర్ట్ నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు
X

దిశ, ఆలూర్: ఆలూర్ మండలం దేగాం గ్రామంలో దెబ్బతిన్న కల్వర్ట్ కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రామ సర్పంచ్ ఇట్టిడి లింగారెడ్డి దిశ దినపత్రిక దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నివేదికను సిద్ధం చేసి ఈఈకి పంపించారు. అనంతరం ఈ విషయాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా కల్వర్ట్ నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఇట్టిడి లింగారెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎంతో అవసరమైన కల్వర్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం హర్షణీయమన్నారు. ప్రజల సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన దిశ దినపత్రికకు, అలాగే సమస్య పరిష్కారానికి కృషి చేసి నిధులు మంజూరు చేయించిన వినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌లకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కల్వర్ట్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను కోరారు.

Next Story