దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు, రోడ్డు మ‌ర‌మ్మ‌తు చ‌ర్య‌లు..!

by Ratna Kumari |

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని గాంధీన‌గ‌ర్ కాల‌నీ స‌మీపంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా జాతీయ ర‌హ‌దారి 63పై రోడ్డు గుంత‌ల‌మ‌యంగా మారింది. దీంతో ఈ రోడ్డు ప్ర‌యాణికుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది.

దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు, రోడ్డు మ‌ర‌మ్మ‌తు చ‌ర్య‌లు..!
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని గాంధీన‌గ‌ర్ కాల‌నీ స‌మీపంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా జాతీయ ర‌హ‌దారి 63పై రోడ్డు గుంత‌ల‌మ‌యంగా మారింది. దీంతో ఈ రోడ్డు ప్ర‌యాణికుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. మంగ‌ళ‌వారం దిశ దినప‌త్రిక‌లో క‌లెక్ట‌ర్, సీపీ ఆదేశాలు బేఖాత‌ర్ అనే క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు ఫోన్ ద్వారా అధికారుల‌ను సంప్ర‌దించారు. అధికారులు స్పందించ‌క‌పోగా నిర్ల‌క్ష్యం స‌మాధానం చెప్ప‌డంతో గ్రామాభివృద్ధి క‌మిటీ, గ్రామ ప్ర‌జ‌లు క‌లిసి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అధికారులు స్పందించ‌క‌పోతే రాస్తారోకో, ధ‌ర్నా చేయాల‌ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో పాటు దిశ‌లో వ‌చ్చిన‌టువంటి కథనానికి అధికారులు స్పందించారు. ఉదయం రోడ్డుపై ఉన్న గుంతలలో మట్టి నింపి ధర్నా చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు రోడ్డు పైకి రాగా, అదే సమయానికి ఆర్ అండ్ బి అధికారులు వచ్చారు. రోడ్డు పక్కన ఉన్న పెద్దగుట్ట ను పరిశీలించారు. గుట్ట నుంచి వస్తున్న వర్షం నీరు ద్వారా రోడ్డు పాడవుతున్నందువలన, రోడ్డు పక్కన వర్షపు నీరు పోయే విధంగా కందకాలు తీయించాలని అధికారులకు నివేదిస్తామన్నారు. ప్రస్తుతానికి రోడ్డుపై ఉన్న గుంతలలో కంకర, సిమెంటుతో మరమత్తు పనులు చేస్తున్నారు. పది రోజుల్లో డాంబర్ తో గుంతలు మరమ్మతు చేస్తామని అధికారులు వెల్లడించారు.

Next Story