కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని త‌హ‌శీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

by Ratna Kumari |

కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మండలంలోని తాండూరు కిచ్చన్నపేట గ్రామస్తులు బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు

కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని త‌హ‌శీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
X

దిశ, నాగిరెడ్డిపేట్ : కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మండలంలోని తాండూరు కిచ్చన్నపేట గ్రామస్తులు బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 95/1 గల స్థలంలో గత కొన్ని సంవత్సరాలుగా కాస్తులో ఉన్నామని, ప్రస్తుతం ఈ స్థలాన్ని అక్కంపల్లి గ్రామపంచాయతీ వారు స్వాధీనపరచుకోవాలని చూస్తున్నారని తెలిపారు. తమకు ఏఆధారం లేకుండా ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు. తాము కాస్తు లో ఉన్న స్థలాలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనంతరం ఇన్ చార్జి తహశీల్దార్ రాజేశ్వర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దివిటి కిష్టవ్వ, నాయకోటి సావిత్రి, జోడు సిద్ధవ్వ, మాదాస్ సత్యవ్వ, కుమ్మరి గోపాల్, జక్కుల అంజయ్య, మాదాస్ అంజయ్య, కిష్టయ్య, కమ్మరి శంకరయ్య, జక్కుల పద్మ, జక్కుల సావిత్రి, జోడు సిద్ధవ్వ, నారాయణ, సాయి కుమార్, దివిటి కిష్టయ్య, పేరుపల్లి విట్టల్ పాల్గొన్నారు.

Next Story