అధికార కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : నీలం క‌ళావ‌తి ర‌మేష్

by Ratna Kumari |

అధికార కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కామారెడ్డి మున్సిప‌ల్ ప‌రిధిలోని దేవునిప‌ల్లి 10వ వార్డు అభ్య‌ర్థిని నీలం క‌ళావ‌తి ర‌మేష్ తెలిపారు.

అధికార కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : నీలం క‌ళావ‌తి ర‌మేష్
X

దిశ, కామారెడ్డి : అధికార కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కామారెడ్డి మున్సిప‌ల్ ప‌రిధిలోని దేవునిప‌ల్లి 10వ వార్డు అభ్య‌ర్థిని నీలం క‌ళావ‌తి ర‌మేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్న త‌న‌ను చేయి గుర్తు పై ఓటు వేసి గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. శుక్ర‌వారం వార్డులో పార్టీ మ‌హిళ‌ల‌తో క‌లిసి ఇంటింటికి తిరిగి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గెలుపొందుతే వార్డులో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తానన్నారు. అలాగే తాను సొంత నిధులతో స్వయంగా అమలు చేయనున్న పథకాలను కూడా వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో వార్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





Next Story