- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత దాడిలో పాడి దూడ మృతి
మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉంచిన రెండేళ్ల వయసు గల పాడి దూడను శుక్రవారం తెల్లవారు జామున చిరుత పులి దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

దిశ, లింగంపేట : మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉంచిన రెండేళ్ల వయసు గల పాడి దూడను శుక్రవారం తెల్లవారు జామున చిరుత పులి దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన చౌడం లింగం అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద పాడి గేదెలను, ఆవులను గురువారం సాయంత్రం కట్టేసి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం పంటచేను వద్దకు వెళ్లి చూడగా చిరుత పులి పాడి దూడను హతమా ర్చినట్టు ఆయన గుర్తించా రు. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చెప్పగా.. ఎర్ర పహాడ్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, లింగంపల్లి బీట్ ఆఫీసర్ లింగయ్య ఘటన స్థలానికి చేరుకొని పాడి దూడ మృతదేహాన్ని పరిశీలించారు. చిరుత పులి దాడి చేయడంతోనే పాడిదూడ మృతి చెందినట్లు వారు నిర్ధారించారు. ప్రభుత్వ పశు వైద్యురాలు హన్నా జోనస్ పోస్టుమార్టం నిర్వహిం చారు. మృతి చెందిన పాడి దూడ విలువ రూ.50 వేలు ఉంటుందని బాధిత రైతు చౌడంలింగం తెలిపా రు. అటవీ శాఖ అధికారులు నష్టపరిహారం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు.






