మున్సిపల్ చైర్మన్ తీరుపై అసంతృప్తి.. అవిశ్వాసం పెట్టే యోచనలో కౌన్సిలర్లు!

by Dishanational4 |
మున్సిపల్ చైర్మన్ తీరుపై అసంతృప్తి.. అవిశ్వాసం పెట్టే యోచనలో కౌన్సిలర్లు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బల్దియా రాజకీయాల అవిశ్వాస సేగ కామారెడ్డి జిల్లాను తాకింది. మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ మార్చాలని జరిగిన రాజకీయాలు కొలిక్కి రాకముందే.. ఉమ్మడి జిల్లాలో మరో మున్సిపాలిటీపై అవిశ్వాస కత్తి వేలాడుతుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం చెలరేగింది.

మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తీరుపై అధికార బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. 12 మంది సభ్యుల్లో గోవాకు క్యాంపుకు తరలిన ఏడుగురు కౌన్సిలర్లు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ తీరుతో సభ్యుల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. చైర్మన్ మార్చాలని క్యాంప్ రాజకీయాలు ప్రారంభించారు.

గోవా క్యాంపుకు తరలివెళ్లిన వారిలో ముగ్గురు కౌన్సిలర్లతో పాటు.. మరో నలుగురు కౌన్సిలర్ల భర్తలు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో బల్దియాలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పంచాయతీ తెరపైకి రావడం బీఆర్ఎస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 5న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నాటికి ఎల్లారెడ్డి బల్దియాపై అవిశ్వాస తీర్మాన గడువు పరిధిలోకి వస్తుందని, అందుకోసమే ముందస్తుగా క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.

Next Story

Most Viewed