- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్డెన్ మచ్చేందర్ ను విధుల నుంచి తొలగించాలి : విద్యార్థి సంఘాలు
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహ వార్డెన్ మచ్చేందర్ అక్రమాలపై , విద్యార్థులతో

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహ వార్డెన్ మచ్చేందర్ అక్రమాలపై , విద్యార్థులతో వెట్టి చాకిరి చేపిస్తున్న తదితర అంశాలపై ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు , బీవీఎం జాతీయ నాయకులు శ్రీధర్ బట్టు మాట్లాడుతూ.. గతవారం హాస్టల్ బిల్డింగ్ పై ఉన్నటువంటి నీటి కుళాయిలను విద్యార్థుల చేత ఏలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా విద్యార్థులతో శుభ్రం చేయించడం అనే విషయం చాలా హేయమైన విషయం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలుగా 107 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే అన్నారు. అలాంటి సంఘటనలన్నీ ఇలాంటి వారి వలన జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయమై అధికారులు తమకు పట్టినట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. గతంలో విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్లో ఉన్న సమస్యల పరిష్కారం చేయాలని విద్యార్థులతో మాట్లాడడానికి వెళితే మీరు ఎవరు అంటూ విద్యార్థి సంఘ నాయకుల పట్ల దురుసుగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఇదే కాకుండా హాస్టల్లో మిగిలిన బియ్యం సైతం పక్కదారి పట్టిస్తూ అమ్మడం జరుగుతుందని ఆరోపించారు.
ఒక అధికారి సెలవులపై వెళ్లితే.. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిం ఉంటుంది. కానీ తనకు తానే రాజునంటూ ఎవ్వరి అనుమతి లేకుండా, ఎవరితోని అవసరం లేనట్టుగా నాలుగు రోజులపాటు ఎవరికి సమాచారం లేకుండా సెలవులపై వెళ్లడం జరిగిందని వారు అన్నారు. విద్యార్థి సంఘాల నాయకులకు విద్యార్థులు కాస్మోటిక్ చార్జీలు ఇప్పటివరకు కూడా గత రెండు సంవత్సరాల నుండి ఇవ్వలేదని అన్నారు. గుడ్డు, స్నాక్స్, పండ్లు , స్వీట్ మెనూ ప్రకారం పెట్టడం లేదని , అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన మెనూ నడుస్తే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ప్రత్యేకమైన ఆహార పట్టిక నడిపిస్తున్నారని అన్నారు. విద్యార్థులు తమ సమస్యలు విద్యార్థి సంఘాలకు చెప్పుకుంటే సమస్యలు చెప్పుకున్న విద్యార్థులకు అతి కిరాతకంగా చితకబాది హుకుం జారీ చేయడం ఏంటని మండిపడ్డారు. వార్డెన్ మచ్చేందర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండతో నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటూ నేను జీవన్ రెడ్డి మిత్రుడిని అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
విద్యార్థి సంఘాలు సమస్యలపై మాట్లాడడం నేరమా విద్యార్థులు సమస్యల గురించి చెబితే నేరమా..? ఈ విషయాన్ని అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం సిగ్గు చేటు అన్నారు. ఒక వర్కర్ స్థానంలో మరొకరిని పెట్టుకొని డబ్బులు తీసుకుంటున్నారు. ఎప్పుడు చూసినా కూడా వారు కార్యాలయంలో ఉండకుండా గైర్హాజరు అవుతారు. కానీ 100% అటెండెన్స్ ని వేసుకుంటున్నారని అన్నారు. ఇలా ప్రభుత్వ జీతం పొందుతూ అధికారులను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఇలాంటి అవినీతి అక్రమ వార్డెన్లను ప్రోత్సహించడం మంచిది కాదని అన్నారు. పిల్లలకు పెట్టేటువంటి గుడ్డులో, ప్రతి పౌష్టికాహారంలో, అన్నింటిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నాణ్యతలేని బువ్వను విద్యార్థులకు ఈ వార్డెన్ అందిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో గత సెప్టెంబర్ నుండి చలికాలం విపరీతంగా పెరిగినప్పటికీ ఇప్పటివరకు విద్యార్థులకు కప్పుకోవడానికి చెద్దర్లు ఇవ్వనటువంటి వైనం మనం చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం ఒక అహంకారమైన ధోరణి అట్లాగే వారి నిర్లక్ష్య ధోరణికి ఇది ప్రతిబింబంగా కనబడుతోంది అన్నారు. ఒక వార్డెన్ గా తాను చేయాల్సినటువంటి ఏ పనులు చేయకుండా బయట ఉద్యోగ సంఘాల నాయకుల అండతోని జేఏసీ అండతో అట్లాగే రాజకీయ నాయకులు అండతోని వీరప్రగాల్బలు పలుకుతూ తానకు నచ్చిందే చేస్తూ చట్టాలను అన్నింటిని భూ తగధాలు చేస్తూ ఉన్నాడు.
మరోవైపు వర్కర్ల మీద అత్యంత పాశవీకంగా క్రూరంగా వ్యవహరిస్తాడని, విద్యార్థుల పైన మితిమీరినటువంటి తనతో బెదిరింపులకు పరుషపదజాలంతో మాట్లాడుతూ చిన్నపిల్లలు సుదూర ప్రాంతాల నుండి తమ తల్లిదండ్రులను వదిలేసి ఇవాళ విద్యాభివృద్ధి కొరకై ఈ వసతి గృహాలకు వచ్చినప్పుడు వారికి అన్నీ తానై చూసుకోవాల్సి నటువంటి వార్డెన్ వారిని ఇబ్బందులు పెట్టడం అనేది విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వార్డెన్ల సంఘం అధ్యక్షుడిగా , రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటూ విర్రవిగుతు, జిల్లాలో పంచాయతీలు తెంపడం , సెటిల్మెంట్లు చేయడం , భూ తగాదాలు చేయడం , వీరీకి వెన్నతో పెట్టిన విద్య అయింది అన్నారు. కావున విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వార్డెన్ మచ్చేందర్ ను అదే విధంగా తనకు సహకరిస్తున్న అటువంటి ఏబిసిడిఓ సుజయ్ , వారికి సహకరిస్తున్న మిగతా ఉన్నత అధికారుల పైన చర్యలు తీసుకొని ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేసే విధంగా చొరవలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి అధికారులు హాస్టళ్లకు పనికిరారని వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుదపల్లి అఖిల్, యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగరాజ్, వెంకటేష్, వికాస్ పాల్గొన్నారు.






