- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏర్గట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
ఏర్గట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయింది. సోమవారం పట్టణ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు, లబ్ధిదారులతో

దిశ, ఏర్గట్ల : ఏర్గట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయింది. సోమవారం పట్టణ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు, లబ్ధిదారులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్గట్ల గ్రామానికి అర్హత పొందిన 51 ఇండ్లలో 30 ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయని, మిగతా 21 ఇళ్లను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అదనంగా రెండవ, మూడవ జాబితాల ద్వారా గుర్తించిన 60 మంది లబ్ధిదారులకు కూడా త్వరలో ఇళ్లు మంజూరు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపేవారు గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టేజి ప్రకారం నిధులు అందుతాయన్నారు. ప్రతి అర్హుడికి 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల వరకు ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జాకీర్, పట్టణ ఇందిరమ్మ కమిటీ సభ్యులు పన్నాల నర్సారెడ్డి, దొబ్బల చిన్న లక్ష్మణ్, జుంగల గణేష్, పాకాల ప్రసాద్ గౌడ్, సంగెం నడిపి గంగాధర్, మన్నన్, కామని గణేష్, అబ్దుల్, బాజీ సాహెబ్, వెంకట్ రెడ్డి, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






