కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రౌడీ షీట‌ర్ రియాజ్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్ర‌మోద్ ని ఈనెల 17న హ‌త్య చేసిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రౌడీ షీట‌ర్ రియాజ్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్ర‌మోద్ ని ఈనెల 17న హ‌త్య చేసిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి బుధ‌వారం కానిస్టేబుల్ ప్ర‌మోద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. ప్ర‌మోద్ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ప్ర‌మోద్ త‌ల్లి, భార్య, పిల్ల‌ల‌తో ఆప‌టు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ప‌ని చేస్తున్న ఆయ‌న సోద‌రుడితో కూడా మాట్లాడారు. ప్రమోద్ మృతితో తమ కుటుంబం రోడ్డున పడిందని, ప్రమోద్ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారని, ప్రమోద్ లేని జీవితాన్ని తాము ఊహించుకోవడానికే భయంగా ఉందని ప్రమోద్ తల్లి, భార్య ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ప్రమోద్ ను తిరిగి తీసుకురాలేమని, మీ కుటుంబానికి ఎలాంటి కష్టం కలగుకుండా పోలీసు డిపార్ట్మెంట్ ఎళ్లవేళలా అందుబాటులో ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసు సంక్షేమ సంఘం తరఫున ఏమేం సాయం అందిస్తున్నారనే విషయాన్ని డీజీపీ ప్రమోద్ కుటుంబ సభ్యులకు వివరించారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా స్థానికంగా ఉండే సీపీ ని కలవాలని.. పూర్తి పోలీసు శాఖ మీ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ధైర్యంగా ఉండాలని డీజీపీ ప్రమోద్ కుటుంబ సభ్యులకు తెలిపారు.

Next Story