- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వసూళ్ల పర్వం పై అలకబూనిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు అధ్యక్షతన గురువారం 11 గంటలకు జరగాల్సిన సర్వసభ్య సమావేశానికి అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లే వసూళ్ల పర్వం పై అలక బూని సమావేశానికి గంట పాటు డుమ్మా కొట్టి మరోచోట ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు అధ్యక్షతన గురువారం 11 గంటలకు జరగాల్సిన సర్వసభ్య సమావేశానికి అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లే వసూళ్ల పర్వం పై అలక బూని సమావేశానికి గంట పాటు డుమ్మా కొట్టి మరోచోట ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు ఒక ముగ్గురు నలుగురు కౌన్సిలర్లతోనే అంతా నడిపిస్తూ తమను పట్టించుకోవడం లేదన్న బాధతోనే అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు గురువారం ఉదయం 11 గంటలకు జరిగిన సర్వసభ్య సమావేశానికి.. మున్సిపల్ ఏరియా లో జరుగుతున్న వసూళ్ల పర్వం పై అలక వహించి గంట పాటు డుమ్మా కొట్టి సుమారు 11 మంది కౌన్సిలర్లు మరోచోట ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం.
అధికార కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఇటీవలే కైవసం చేసుకోగా, కొద్ది రోజుల్లోనే అధికార కాంగ్రెస్ పార్టీ సొంత కౌన్సిలర్లే ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన తొలి గంట డుమ్మా కొట్టి రాక మరోచోట ప్రత్యేకంగా కౌన్సిలర్లు కౌన్సిలర్ల భర్తలు సమావేశం కావడంతో వెంటనే మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి భర్త గోనె రఘు రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వాన్ని ప్రారంభించారు. అధికార పార్టీ కౌన్సిలర్లు అందరూ సర్వసభ్య సమావేశానికి రాకపోతే బాగుండదని ఇదివరకు ఏం జరిగిందో ఏమో కానీ ఇక ముందు మాత్రం ప్రతిదీ సమాచారమిచ్చి పనులు చక్కబెట్టుకుందామని సర్వసభ్య సమావేశం తర్వాత చర్చించుకుందాం సమావేశానికి రండి అని చైర్పర్సన్ భర్త అలిగిన ఆర్మూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను బుజ్జగించినట్లు తెలిసింది. అలిగిన ఆర్మూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న చోటికి వెళ్లి ఏమైనా అంతర్గత విషయాలు ఉంటే మున్సిపల్ సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత చర్చించుకుందాం అని ముందుగా సర్వసభ్య సమావేశానికి రావాలని మున్సిపల్ కౌన్సిలర్లను కోరినట్లు తెలిసింది.
ఆర్మూర్ మున్సిపల్ లో ప్రధానంగా మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ వైస్ చైర్మన్, మరో నలుగురు కౌన్సిలర్లతో కలిసి ప్రతిదీ ఒంటెద్దు పోకడలతో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్న తీరుపై అలక వహించిన అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ భర్తను నిలదీసినట్లు తెలిసింది. చైర్ పర్సన్ భర్త సర్వసభ్య సమావేశం తర్వాత చర్చించుకుందాం అని అలిగిన అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు బుజ్జగించి సర్ది చెప్పడంతో మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. దీంతో అలకపోయినా మున్సిపల్ కౌన్సిలర్లు సర్వసభ్య సమావేశానికి హాజరు కావడంతో సర్వసభ్య సమావేశం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు తూతూ మంత్రంగా మామా అనిపించినట్లు తెలిసింది. సర్వసభ్య సమావేశం అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు వేరువేరుగా మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ఛాంబర్ లలో వేరువేరుగా ప్రత్యేకంగా సమావేశమై అంతర్గత విషయాలపై, వార్డుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలిసింది.






