- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాశకు పోతే అసలుకే ఎసరు..?
దిశ, దోమకొండ : ఒకేసారి శ్రీమంతులం కావాలనే అత్యాశతో..సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, వారిచ్చిన టాస్క్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని ఆశకు పోయి అసలుకే ఎసరు తెచ్చుకున్న ఉదాంతం దోమకొండ

దిశ, దోమకొండ : ఒకేసారి శ్రీమంతులం కావాలనే అత్యాశతో..సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, వారిచ్చిన టాస్క్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని ఆశకు పోయి అసలుకే ఎసరు తెచ్చుకున్న ఉదాంతం దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి తన మొబైల్ లో ఉన్న టెలిగ్రామ్ యాప్ లో లింకు రావడంతో తెలిసో తెలియకొ ఓపెన్ చేయగా గుబీబో యాప్ ద్వారా కొన్ని టాస్క్ లను సైబర్ నేరగాళ్లు ఒక్కొక్కటిగా ఇచ్చారు. ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో, వారిచ్చిన టాస్క్ లను ఒకటి తర్వాత మరొకటి పూర్తి చేశాడు. అలా మూడుసార్లు టాస్క్ పూర్తి చేయగా అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్ పెట్టారు. ఈ అమౌంట్ అకౌంట్ లోకి క్రెడిట్ కావాలంటే అడ్వాన్స్ గా కొంత అమౌంట్ పంపాలంటూ మెసేజ్ చేశారు. విడతలవారీగా సుమారు 2 లక్షల 74 వేల రూపాయలు ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేశాడు. పేమెంట్ అయ్యాక తిరిగి డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ స్రవంతి వివరించారు.






