ఆర్మూర్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

by Ratna Kumari |

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ , భీంగల్ లో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆర్మూర్ లో బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్య వేక్షించారు.

ఆర్మూర్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ , భీంగల్ లో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆర్మూర్ లో బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్య వేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరచు కోవాలని, సిబ్బంది ఎక్కడ కూడా అలసత్వం వహించ రాదని సూచించారు. ఓటర్లతో, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని , ఎన్నికల ప్రవర్తన నియమాలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని తెలియజేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయం, సంతోష్ నగర్ లోని విద్య హైస్కూల్లో పోలింగ్ బూతులను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. కమిషనర్ వెంట ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఏ.ఆర్.ఓ భూమేశ్వర్, ఎన్నికల సంబంధించిన సంబంధిత అధికారులు ఉన్నారు.

Next Story