'కొత్త రాజ‌కీయ శ‌క్తిగా వ‌స్తున్నాం'.. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

by Ratna Kumari |

కొత్త రాజ‌కీయ శ‌క్తిగా వ‌స్తున్నాం అనే పోస్ట‌ర్ ను బాన్సువాడ‌లో మామిండ్ల రాజు ఆధ్వ‌ర్యంలో ఆవిష్క‌రించారు.

కొత్త రాజ‌కీయ శ‌క్తిగా వ‌స్తున్నాం.. పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ
X

దిశ, బాన్సువాడ : అమరుల ఆశయ సాధన కోసం.. "సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం"అనే నినాదంతో ఈ నెల 25న మేడ్చ‌ల్ జిల్లాలోని మునీరాబాద్ వ‌ద్ద ఉన్న అద్వ‌య క‌న్వెన్ష‌న్ హాల్ వ‌ద్ద కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ సభ జ‌రుగ‌నుంది. బాన్సువాడ నియోజకవర్గ నాయ‌కులు మామిండ్ల రాజు, గూల సత్యం, కిష్టపూర్ గంగాధర్ లు ఈ స‌భ‌కి సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌రించారు. నియోజకవర్గం నుంచి సుమారు 50 వాహనాల్లో ప్రజలను తరలించనున్నట్లు తెలిపారు. ఆ రోజు అమరుల ఆశయ సాధన, సంపూర్ణ తెలంగాణ వికాసం నినాదంతో కొత్త రాజకీయ వేదిక ఆవిష్కృతం అవుతుందని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్టీ కండువాలు ధరించిన పలువురు ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. "రండి కదిలి రండి సర్వోదయ తెలంగాణకై కలిసి నడుద్దాం" అనే నినాదంతో ప్రజలను ఆహ్వానిస్తున్నామని సీనియర్ జర్నలిస్ట్ మామిండ్ల రాజు తెలిపారు.

Next Story