- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
దిశ, కామారెడ్డి : కలెక్టరేట్ ఆవరణలో నిర్మించనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలాన్ని శనివారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 33

దిశ, కామారెడ్డి : కలెక్టరేట్ ఆవరణలో నిర్మించనున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలాన్ని శనివారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్ లో ఈ విగ్రహ ఏర్పాటు కోసం రూ. 5.80 కోట్లు నిధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ విజేతలను సన్మానించిన కలెక్టర్
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాకు మీరు తెచ్చిన గౌరవం ప్రశంసనీయమైనదనీ, ఇదే ఉత్సాహం, కృషి, పట్టుదలతో ముందుకు సాగి, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా రంగంలో జిల్లాకు మరిన్ని విజయాలు సాధించేలా తగిన సదుపాయాలు కల్పించడానికి జిల్లా యువజన, క్రీడాశాఖ తరపున కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి రంగ వేంకటేశ్వర గౌడ్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సెక్రటరి అనిల్, క్రీడాకారులు పాల్గొన్నారు.






