- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్స్ ర్యాంకర్ మహేష్ ను అభినందించిన కలెక్టర్
by Kema Shiva Kumar |
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో అఖిల భారత సర్వీసులకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేష్ కుమార్ ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తన ఛాంబర్ లో అభినందించారు.

X
దిశ, నిజామాబాద్ సిటీ : ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో అఖిల భారత సర్వీసులకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేష్ కుమార్ ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తన ఛాంబర్ లో అభినందించారు. మహేష్ కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, సివిల్స్ కోసం సన్నద్ధమైన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ స్థాయిలో 200 ర్యాంకు సాధించడం ఎంతో గొప్ప విషయమని కలెక్టర్ ప్రశంసించారు. మహేష్ కు స్వీట్స్ తినిపించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిని అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీ.ఎం.హెచ్.వో డాక్టర్ సుదర్శనం, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






