కొనుగోలు చేసిన ధాన్యం వెంట‌నే త‌ర‌లించాలి : క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కామారెడ్డి : కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్ ఇన్ చార్జీల‌ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి

కొనుగోలు చేసిన ధాన్యం వెంట‌నే త‌ర‌లించాలి : క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ‌, కామారెడ్డి : కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్ ఇన్ చార్జీల‌ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేయాలనీ, వెంట వెంటనే లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రైతుల నుంచి కొనుగోలు చేసిన అనంతరం ఎప్పటికప్పుడు లారీలలో లోడ్ చేయించి మిల్లులకు తరలించాలని, ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. తేమశాతం చెక్ చేయాలనీ, ప్రతిరోజూ సంబంధిత అధికారులు, మండల అధికారులు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు టాబ్ ఎంట్రీ లు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందిస్తూ ఏ - గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు 2389 రూపాయలు, సాధారణ రకానికి 2369 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడం తో పాటు సన్న రకానికి అదనంగా 500 రూపాయల చొప్పున బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట సివిల్ సప్లై వెంకటేశ్వర్లు ఉన్నారు.

Next Story