- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదింటి కలను సాకారం చేసి సీఎం రేవంత్ రెడ్డి : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
మాట తప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, పేదవారి ఇంటి కల సాకారం చేసి ఇచ్చిన మాట ప్రకారం.. నిర్మించిన ఇళ్లను శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇద్దరు లబ్ధిదారులకు అందజేశారు.

దిశ, కామారెడ్డి : మాట తప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, పేదవారి ఇంటి కల సాకారం చేసి ఇచ్చిన మాట ప్రకారం.. నిర్మించిన ఇళ్లను శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇద్దరు లబ్ధిదారులకు అందజేశారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో భిక్కనూరు లక్ష్మి, చిట్యాల రాజమణి అనే ఇద్దరు పేద వారికోసం నిర్మించిన ఇళ్లకు గృహ ప్రవేశం చేసి వారికి బట్టలు పెట్టి దీవించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఇచ్చిన మాట గాలికి కొట్టుకుపోయే కాలమిది అని, కానీ తాను ఇచ్చిన హామీని ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోనని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారన్నారు. మూడేళ్ల క్రితం ఒక సామాన్య పేద కుటుంబానికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ.. చిన్న మల్లారెడ్డి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం అత్యంత వైభవంగా జరిగిందన్నారు.
నాడు కన్నీళ్లు.. నేడు చిరునవ్వులు
పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో 18-03-2023 రోజు భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ రోజు వారి కన్నీళ్లు చూసి చలించిపోయిన ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని మాటిచ్చారు. నేడు ఆ మాట అక్షర సత్యమైందని తెలిపారు.
ఇది కేవలం ఒక ఇల్లు కాదు.. రేవంత్ రెడ్డి నైతికతకు నిదర్శనం
రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో చెబుతారు, కానీ అధికారంలోకి వచ్చాక పాత మాటలను మర్చిపోవడం పరిపాటి. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదని.. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పర్యటనలో ఇచ్చిన మాటను గుర్తుంచుకుని, నన్ను పిలిచి మరీ చిన్న మల్లారెడ్డిలో ఆ కుటుంబానికి ఇచ్చిన మాట ఏమైంది షబ్బీర్ భాయ్? అని ఆరా తీశారన్నారు. ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇంటి పథకం కింద రూ.5 లక్షలు మంజూరు చేయడమే కాకుండా, ఆ ఇల్లు ఒక దేవాలయంలా సుందరంగా ఉండాలని సీఎం ప్రత్యేకంగా సూచించారన్నారు. అందుకే వ్యక్తి గతంగా రెండు ఇళ్లకు చేరో 5 లక్షల రూపాయలు చొప్పున 10 లక్షలువెచ్చించి, పూర్తిస్థాయి సౌకర్యాలతో ఈ ఇళ్లను నిర్మించామన్నారు. ఇవాళ ఈ కుటుంబం ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూస్తుంటే.. మా ప్రభుత్వానికి వందల కోట్ల ప్రజా పాలన విజయం దక్కినట్టు అనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదవాడి పక్షమేనని చెప్పడానికి ఈ గృహమే ఒక సాక్ష్యం అన్నారు.కేవలం ఇల్లు కట్టించి ఇవ్వడమే కాకుండా, గృహప్రవేశం సందర్భంగా ఆ రెండు కుటుంబాలకు షబ్బీర్ అలీ కొత్త వస్త్రాలు, పూర్తి వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను స్వయంగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క లబ్ధిదారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం మీ కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని.. కొత్త ఇంట్లో మీ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ మధుమోహన్, గ్రామ సర్పంచ్ బీమాయల లక్ష్మీరాజు, ఉప సర్పంచ్ స్వప్న లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామాగాడ్, హనుమాల రామ్ కుమార్ పాల్గొన్నారు.






