- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛలో తాడ్వాయి.. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం..!
దిశ, తాడ్వాయి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం తాడ్వాయి

దిశ, తాడ్వాయి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని,ఎన్నికల వాగ్దానం ప్రకారం క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.రెండు లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని అన్నారు.మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలు కేంద్రాల గడువును వెంటనే పొడిగించాలని పేర్కొన్నారు. మార్కెట్‌లో పాల ధరలను అమాంతం తగ్గించి పాడి రైతుల నడ్డి విరుస్తున్నారని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించి కాలయాపన చేస్తోందని బిఆర్ఎస్ నేతలు విమర్శించారు.రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని,ఇందులో భాగంగానే సోమవారం నిర్వహించే ధర్నాకు మండలంలోని రైతులు,పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పులగం సాయి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నర్సింహులు, రాజిరెడ్డి, సాయిరెడ్డి, సంజీవులు,మెట్టు రాము,బిఆర్ఎస్ సర్పంచులు మంగారెడ్డి,మైలారం రవీందర్ రెడ్డి,తాజుద్దిన్,కొరివి నర్సింలు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.






