ఆర్మూర్ లోని సిద్దుల గుట్టపై చిరుత పులి సంచారం..

by Bhanu |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై చిరుత పులి సంచరిస్తున్నట్లు వీడియో సోషల్, పలు మాధ్యమాల్లో మీడియాలో పలు గ్రూపుల్లో సోమవారం సాయంత్రం నుంచి వైరల్ అవుతుంది.

ఆర్మూర్ లోని సిద్దుల గుట్టపై చిరుత పులి సంచారం..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టపై చిరుత పులి సంచరిస్తున్నట్లు వీడియో సోషల్, పలు మాధ్యమాల్లో మీడియాలో పలు గ్రూపుల్లో సోమవారం సాయంత్రం నుంచి వైరల్ అవుతుంది. గత నెల క్రితం సిద్దుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులతో, పాటు భక్తులకు సిద్దులగుట్ట పైన చిరుత పులి సంచరిస్తున్నట్లు కనపడినట్లు అప్పట్లో కొందరు వాపోయారు. ప్రత్యేకంగా సోమవారం సిద్ధిరగుట్ట పైన ప్రత్యేక పూజలు అభిషేకాలు విశేషంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం రోజు సిద్దుల గుట్టకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డు గుండా సిద్దుల గుట్టకు వెళుతున్న భక్తులకు గుట్టలోని కొండలపైన చిరుత అటువైపుగా వెళుతుండడంతో వారు వారి సెల్ ఫోన్ లో వీడియో తీసి ఆ విషయాన్ని సిద్దుల గుట్ట పైన గల భక్తులకు సమాచారం ఇచ్చారు.


దీంతో సిద్దుల గుట్ట పైన గల భక్తులందరూ గుట్టపైన పులి సంచారంతో ఎవరికివారుగా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ భక్తులు తీసిన వీడియో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ లోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై చిరుత పులి పులి సంచారం సంఘటన సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఆర్మూర్ సిద్దుల గుట్ట పైన చిరుత పులి సంచారం జిల్లాలోని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నవరాత సిద్దుల గుట్ట పైన గల సిద్దేశ్వరుని సందర్శించే భక్తులందరూ గుట్ట పైకి ఎక్కే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.



Next Story