- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేమీలో చిరుత పంజా.. అటవీశాఖ అధికారుల గూరక!
ఎర్రపహడ్, మోతె గ్రామ శివారుల్లో వరుసగా జరుగుతున్న చిరుత దాడుల ఘటనలు మరువకముందే తాజాగా దేమి గ్రామ శివారులో చిరుత పులి మరోసారి పంజా విసిరింది.

దిశ, తాడ్వాయి : ఎర్రపహడ్, మోతె గ్రామ శివారుల్లో వరుసగా జరుగుతున్న చిరుత దాడుల ఘటనలు మరువకముందే తాజాగా దేమి గ్రామ శివారులో చిరుత పులి మరోసారి పంజా విసిరింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఓ లేగదూడ ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. దేమి గ్రామానికి చెందిన రైతు గొల్ల సంజీవులుకు చెందిన లేగదూడపై సోమవారం రాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడు సంజీవులు తన పశువును కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు.
ప్రజల ప్రశ్న.. అధికారుల నిర్లక్ష్యం?
గత కొద్ది రోజులుగా ఎర్రపహడ్, మోతె ప్రాంతాల్లో మూగజీవాలపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ, అటవీశాఖ అధికారులు కేవలం సమీక్షలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకోవడానికి ఇప్పటివరకు బోన్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు?వరుస దాడులు జరుగుతున్నా నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదు?రైతుల ప్రాణాలు, పశువుల రక్షణకు గ్యారెంటీ ఏది?అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.






