సమాజంలో మార్పు, పారదర్శకమైన రాజకీయాలే జనసేన లక్ష్యం : మచ్చ సుధాకర్

by Ratna Kumari |

సమాజంలో మార్పు కోసం, పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన పనిచేస్తుందని, జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికీ చేరుస్తామని ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ అన్నారు.

సమాజంలో మార్పు, పారదర్శకమైన రాజకీయాలే జనసేన లక్ష్యం : మచ్చ సుధాకర్
X

దిశ, భీమ్‍గల్ : సమాజంలో మార్పు కోసం, పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన పనిచేస్తుందని, జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికీ చేరుస్తామని ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ అన్నారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా జనసేన పార్టీని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో నిజామాబాద్ జిల్లా భీమ్‍గల్ పట్టణంలో గురువారం జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని మచ్చ సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ శ్‌రేణులు పని చేస్తారన్నారు. సమాజంలో మార్పు కోసం, పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి చేరుస్తామని సుధాకర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం ఒక వేదికగా పని చేస్తుందని బాల్కొండ నియోజకవర్గం కో ఆర్డినేటర్ శివసారి ఫణీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గణేష్ తేజ, నవీన్ రెడ్డి, జి. శ్రీనివాస్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, డి. నవీన్ కుమార్, బి. దిలీప్, తిరుపతి గౌడ్, మేస రమేష్, బొదిరె నరేష్ లతో పాటు వీరమహిళలు సరిత, సునీతలు కూడా పాల్గొన్నారు. జై జనసేన, సిద్ధాంతం ముఖ్యం - వ్యక్తిత్వం ముఖ్యం అంటూ చేసిన నినాదాలు చేస్తూ నినాదాలతో జనసైనికులు హోరెత్తించారు.

Next Story