- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేలుడు పదార్థాలకు నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు.. చంద్రశేఖర్ రెడ్డి భార్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ
పేలుడు పదార్థాలకు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, సంబంధం లేని కేసులో తన భర్తను అరెస్ట్ చేశారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి, తాజా మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు.

దిశ, కామారెడ్డి: పేలుడు పదార్థాలకు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, సంబంధం లేని కేసులో తన భర్తను అరెస్ట్ చేశారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి, తాజా మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. ఆదివారం తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంతో తమ కష్టానికి గుర్తింపుగా తన భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా అవకాశం ఇచ్చారన్నారు. పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.
అలాంటి మాపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలన్నీ తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని తెలిపారు. గత మూడు రోజుల నుంచి ఫ్రొబెల్స్ స్కూల్ సమీపంలో దొరికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్ కు ముడి పెడుతున్నారని, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. శ్రీవారి వెంచర్ లో తన భర్తకు గుంట భూమి కూడా లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 9:30 గంటలకు ఫోన్ రాగానే తన భర్త ఇంటినుంచి వెళ్లాడని, 11 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్టు తనకు ఫోన్ వస్తే వెళ్లానని పేర్కొన్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేశారన్నారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ వద్ద రిమాండ్ చేశారని, అక్కడి నుంచి నిజామాబాద్ జైలుకు తరలించారని తెలిపారు. శ్రీవారి వెంచర్ ను 2023 లోనే విభూస్ ఏకో టౌన్ షిప్ వారికి డెవలప్మెంట్ లీజ్ అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. తన భర్తను అరెస్ట్ చేయడానికి ముందు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ కేసులో తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. చట్టంపై తమకు నమ్మకం ఉందన్నారు. తన భర్త జైలు నుంచి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.






