- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి : చైర్మన్ కపిల్ రెడ్డి
దిశ, తాడ్వాయి : అకాల వర్షాల కారణంగా తాడ్వాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన మొక్కజొన్న ధాన్యాన్ని సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. వర్షం దాటికి తడిసి నష్టపోయిన

దిశ, తాడ్వాయి : అకాల వర్షాల కారణంగా తాడ్వాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన మొక్కజొన్న ధాన్యాన్ని సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. వర్షం దాటికి తడిసి నష్టపోయిన రైతుల వద్దకు చేరుకొని వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. చేతికందిన పంట వర్షార్పణం కావడంతో రైతులు పడుతున్న ఆవేదనను చూసి చలించిపోయారు. మొక్కజొన్న తడిసిపోవడం వల్ల నాణ్యతా నిబంధనల పేరుతో రైతులకు కోర్రిలు పెట్టి కొనుగోలును ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కోరారు. రైతులు ఎవ్వరూ అధైర్యపడొద్దని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ముదాం నర్సింలు, ప్రధాన కార్యదర్శి గోపాల్ రావు,మండల యూత్ అధ్యక్షులు రమేష్ రావు, సొసైటీ డైరెక్టర్ రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, రాజేందర్ రావు,రాజిరెడ్డి,అరవింద్, శ్యాములు,బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.






