నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

by Ratna Kumari |

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని బీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ అన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని బీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ అన్నారు. శనివారం కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఐ గ్రామస్తులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమోరాలు అందుబాటులోని వస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నేరాలను నియంత్రించేం దుకు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంతమైన వాతవరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో భద్రత మరింత పెరుగుతుందని, ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక ఎస్‌ఐలు ప్రత్యేక చొరువ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్‌ పల్లి ఎస్సై జి. అనిల్ రెడ్డి, సర్పంచ్ బైకాన్ గంగజమున, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

Next Story