అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-09-02 03:47:26  IST  )

బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆర్మూర్‌కు ఇసుక తరలిస్తున్న ఏడు గురి పై కేసు నమోదు చేసి, అక్రమంగా ఇలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఆ ఏడు వాహనాలను పట్టుకుని ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి తరలించారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు..
X

దిశ, ఆర్మూర్: బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆర్మూర్‌కు ఇసుక తరలిస్తున్న ఏడు గురి పై కేసు నమోదు చేసి, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఆ ఏడు వాహనాలను పట్టుకుని ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి తరలించారు. భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామ వాగు నుండి ఆర్మూరుకు ఇసుక తరలిస్తుండగా ఆర్మూర్ మండలంలోని గోవిందపేట్ గ్రామం, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల పెర్కిట్‌లలో మెట్పల్లికి చెందిన ధారంగుల సాహెబు రావ్, బ్రాహ్మణపల్లికి చెందిన పల్లెపు రాజన్న, దేరంగుల వీరన్న, మామిడి మహిపాల్, మోర్తాడ్‌కి చెందిన దేవల్ల ఎల్లయ్య, రామచంద్ర పల్లికి చెందిన ముద్దంగుల రమేష్, మునిపల్లికి చెందిన దండుగుల దుర్గయ్యలు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో వారి లారీలను పట్టుకుని పంచనామా ద్వారా స్వాధీన పరుచుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు.

Next Story