హైవే పై కారు బోల్తా.. న‌లుగురికి గాయాలు

by Ratna Kumari |

నిద్ర మబ్బు ఆవహించిందో ఏమో తెలియదు కాని అదుపుతప్పి కారు బోల్తా పడగా.. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

హైవే పై కారు బోల్తా.. న‌లుగురికి గాయాలు
X

దిశ‌, భిక్క‌నూరు : నిద్ర మబ్బు ఆవహించిందో ఏమో తెలియదు కాని అదుపుతప్పి కారు బోల్తా పడగా.. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న వేగనార్ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఒకసారి గా షాక్ కు గురై వివరాలు చెప్పలేక ఘటన నుంచి నుంచి తేరుకోలేకపోతున్నారు. దీంతో ఆ దారివైపు నుంచి వెళ్లే వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం జరిగిన విషయాన్ని గ్రామస్తులు ఫోన్ ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Next Story