కారు-బైకు ఢీ.. వ్య‌క్తికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |   (  Updated:2026-04-04 12:55:25  IST  )

కారు-బైకు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో వ్య‌క్తికి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది.

కారు-బైకు ఢీ.. వ్య‌క్తికి తీవ్ర గాయాలు
X

దిశ‌, తాడ్వాయి : కారు-బైకు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో వ్య‌క్తికి తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శ‌నివారం తాడ్వాయి రెవెన్యూ కార్యాల‌యం వ‌ద్ద వేగంగా వ‌చ్చిన కారు ద్విచ‌క్ర వాహ‌నాన్ని బ‌లంగా ఢీ కొట్ట‌డంతో ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో బైకు న‌డుపుతున్ వ్య‌క్తి త‌ల‌, శ‌రీర భాగాల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌మాద ధాటికి ద్విచ‌క్ర వాహ‌నం పాక్షికంగా ధ్వంసం అయింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అటుగా వెళ్తున్న ప్ర‌యాణికులు స్పందించి గాయ‌ప‌డిన వ్య‌క్తిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో కొద్దిసేపు ట్రాఫిక్ కి అంత‌రాయం ఏర్ప‌డింది.

Next Story