అక్రమంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : అక్ర‌మంగా ఆర్టీసీ బ‌స్సులో త‌రలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివ‌రాల్లోకి వెళ్లితే.. మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులో గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులు

అక్రమంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం
X

దిశ, కామారెడ్డి : అక్ర‌మంగా ఆర్టీసీ బ‌స్సులో త‌రలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివ‌రాల్లోకి వెళ్లితే.. మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులో గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి మండల శివారులో ని పొందూర్తి చౌరస్తాలో పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా.. 220 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు చెప్పారు. హైదరాబాద్ చింతల్ కు చెందిన కాసమల్ల రాఖేష్‌ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తుండగా దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ విషయమై పూర్తి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Next Story