- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనుగోలు కేంద్రం స్వాగతించదగ్గదే : బీకేఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి
మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించడాన్ని భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ స్వాగతించారు.

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించడాన్ని భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన దిశ తో మాట్లాడారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని కోరుతూనే, రైతుల ఆర్థిక ఇబ్బందులను ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సేకరించిన మొక్కజొన్న పంటకు సంబంధించిన డబ్బులు కొంత మంది రైతుల ఖాతాలో జమ అయినప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో జమ కాలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం రెండో విడతలో కొనుగోలు చేస్తున్న పంటకు కూడా జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో నిధులు అందితేనే రైతులు అప్పుల బాధ నుంచి విముక్తులై, తదుపరి పంటకు సిద్ధమవ్వగలరని ప్రభాకర్ పేర్కొన్నారు.






