బీఆర్ఎస్ 30 శాతం.. కాంగ్రెస్ 40 శాతం క‌మీష‌న్లు : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చందర్ రావు

by Ratna Kumari |

బాన్సువాడ పట్టణంలోని జీఆర్ఆర్ ఫంక్ష‌న్ హాల్ లో బీజేపీ నేతల కార్యకర్తలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించారు.

బీఆర్ఎస్ 30 శాతం.. కాంగ్రెస్ 40 శాతం క‌మీష‌న్లు : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చందర్ రావు
X

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని జీఆర్ఆర్ ఫంక్ష‌న్ హాల్ లో బీజేపీ నేతల కార్యకర్తలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇవాళ‌ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో బీఆర్ఎస్ నాయకులు 30% కమిషన్ తీసుకుంటే ఉచితం కాంగ్రెస్ ప్రభుత్వం లో 40% కమీషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హ‌యాంలో అన్ని రంగాల్లో విఫలమయ్యారు. వారి కుటుంబం మాత్రమే బాగుపడ్డారు. ఎంత బాగుపడ్డారంటే అక్రమంగా సంపాదించిన దానిని పంచుకోలేక చివరికి కుటుంబ సభ్యులలో గొడవలు వచ్చి పార్టీ పెట్టుకునే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు.


ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితిలోని మంత్రులు అవినీతికి పాల్పడి నువ్వెంత నేనెంత అని పంచుకుంటున్నారు. తెలంగాణ ను అభివృద్ధి చేసింది ఏమీ లేదు అని విమర్శించారు. బిజెపి కార్యకర్తలు నాయకులు కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మి నారాయణ, అరుణ తార, జిల్లా ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్, మురళీధర్ రావు రాష్ట్ర నాయకులు, పైడి ఎల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి పాల్గొన్నారు.

Next Story