సౌతాఫ్రికాలో బోర్ డ్రిల్ల‌ర్, ఆప‌రేట‌ర్ హ‌త్య‌.. వారం రోజుల తర్వాత ఇండియాకు మృతదేహం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, భిక్కనూరు : బోర్ డ్రిల్లర్, ఆపరేటర్ గా సౌత్ ఆఫ్రికా దేశంలో పనిచేస్తూ హత్యకు గురైన యువకుడి మృతదేహం వారం రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే..

సౌతాఫ్రికాలో బోర్ డ్రిల్ల‌ర్, ఆప‌రేట‌ర్ హ‌త్య‌.. వారం రోజుల తర్వాత ఇండియాకు మృతదేహం..!
X

దిశ, భిక్కనూరు : బోర్ డ్రిల్లర్, ఆపరేటర్ గా సౌత్ ఆఫ్రికా దేశంలో పనిచేస్తూ హత్యకు గురైన యువకుడి మృతదేహం వారం రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్(32) అనే యువకుడు వారం రోజుల క్రితం సౌత్ ఆఫ్రికాలో హత్యకు గురైన విషయం విధితమే. అయితే శ్రీనివాస్ డెడ్ బాడీ సౌత్ ఆఫ్రికా నుంచి విమానంలో హైదరాబాదులోని ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్స్ లో సాయంత్రం ఇక్కడికి చేరుకోగా.. మృతుని కుటుంబ సభ్యులు స్నేహితులు 44వ హైవే పైనుంచి బైక్ ర్యాలీ ద్వారా ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రాత్రి పట్టణం లోని వైకుంఠధామంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

ఐదు నెలల క్రితమే వచ్చి వెళ్లి...

ఐదు నెలల క్రితమే ఇండియాకు వచ్చి... తిరిగి సౌత్ ఆఫ్రికా కు వెళ్లిన శ్రీనివాస్ విగతాజీవిగా ఇంటికి తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడే తన భర్త ఇక లేడన్న విషయం తెలిసి భార్య నవనీత, కూతురు లాస్య, కుమారుడు నిహాల్ తో పాటు, తల్లి స్వరూప,తండ్రి బలరాం లు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎందుకోసం హత్య చేసి ఉంటారన్న కరెక్ట్ సమాచారం తమకు తెలియలేదడం లేదని మృతుని సోదరుడు బత్తుల స్వామి "దిశ" తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

సీఎం పేషీ నుంచి ఫోన్ వల్లే... ?

సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వారం రోజులవ్యవధిలో డెడ్ బాడీ ఇండియాకు రావడానికి, బోర్ బండ్ల యజమానుల సంఘం తమ పలుకుబడిని ఉపయోగించి సీఎం పేషి నుంచి అక్కడి అధికారులకు ఫోన్ చేయించడం వల్లే డెడ్ బాడీ తొందరగా ఇక్కడికి చేరుకుంద అనే ప్రచారం జరుగుతోంది. లేకుంటే డెడ్ బాడీ రావడానికి మరింత సమయం పట్టేదని చెబుతున్నారు.

Next Story