హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

by velandi.Saikiran |

బాన్సువాడ పట్టణం ఏరియా ఆసుపత్రిలో మిలాద్ - ఉన్ - నబీ సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన

హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
X

దిశ‌, బాన్సువాడ: బాన్సువాడ పట్టణం ఏరియా ఆసుపత్రిలో మిలాద్ - ఉన్ - నబీ సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సుప్రీండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ బాన్సువాడ తరఫున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా 70 మంది రక్త దానం చేశారన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడగల్గుతామని స్ప‌ష్టం చేశారు. ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల‌ని వివ‌రించారు. ఈ సందర్భంగా మౌలానా హఫీజ్ రిజ్వాన్ మాట్లాడుతూ... హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ రక్తదాన శిబిరంలో హిందూ ముస్లిం యువకులు పాల్గొని రక్తదానం చేయడం అభినందనియమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ.పీ. ఏజస్,సొసైటీ అధ్యక్షుడు షకీల్,బ్లడ్ బ్యాంక్ రఘు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హకీమ్, రఫీ,అక్బర్, ఆతిఫ్,ఏజస్, షేరు తదితరులు పాల్గొన్నారు.

Next Story