బీజేపీ జిల్లా ఇంఛార్జి పై దాడి వెనుక బీజేపీ కార్యకర్తలు..?

by Disha Web Desk 20 |
బీజేపీ జిల్లా ఇంఛార్జి పై దాడి వెనుక బీజేపీ కార్యకర్తలు..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర నాయకులు మీసాల చంద్రయ్య ప్రయానిస్తున్న కారు పై ఈ నెల 2వ వారంలో జరిగిన దాడి వెనుక బీజేపీ కార్యకర్తల హస్తం ఉన్నట్లు తేలింది. ఈ మేరకు నులుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. చంద్రయ్య పై దాడి జరిగిన రోజు సంఘటన తాలూకు సీసీటీవీ ఫుటేజీ వీడియోలు వైరల్ అయ్యాయి అందులో బీజేపీ కార్యకర్తలు చంద్రయ్య కారుపై రాళ్లురువ్వి ధ్వంసం చేసినట్లు స్పష్టం అవుతుంది. నిజామాబాద్ బీజేపీ రాజకీయాల్లో గ్రూప్ వర్గాల కొట్లాట జరుగుతున్న విషయం తెలిసింది. ఈ నెల రెండవ వారంలో రాష్ట్ర నాయకులు జిల్లా ఇంచార్జ్ మీసాల చంద్రయ్య జిల్లా పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు.

అక్కడ సమావేశంలో నానా భీభత్సం సృష్టించారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన మీసాల చంద్రయ్య పై నిజామాబాద్ శివారులోని మాధవ్ నగర్ వద్ద కారుపై రాళ్ల దాడి జరిగింది. ఆరోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన రోజు కావడంతో అందరూ దీనిని అధికార పార్టీ పనితీరుగా తప్పు పట్టారు. కానీ సీసీటివి పుటేజీ బీఆర్ఎస్ కు సంబంధం లేదని తేల్చి చెప్పినట్లు అయింది. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని తేల్చే పనిలో ఉన్నారు. శనివారం ఈ కేసులో కొత్త ట్విస్ట్ విలువలోకి వచ్చింది. చంద్రయ్య కాన్వాయ్ పై దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బీజేపీ జిల్లా అధ్యక్షుడు, అతని తమ్ముడితో ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం.


Next Story

Most Viewed