- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ అర్వింద్ సహా బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలని, బీసీలకు అర్వింద్ ఆరాధ్య దైవంగా మిగిలిపోతారని కవిత అన్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలని, బీసీలకు అర్వింద్ ఆరాధ్య దైవంగా మిగిలిపోతారని కవిత అన్నారు. నిజామాబాద్ శివారులోని కృష్ణ హోటల్ లో ఆదివారం కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ సర్కార్ మైనార్టీలో ఉందని, బీజేపీ తెలంగాణలోని ఎంపీలంతా బీసీ బిల్లు కోసం రాజీనామా చేస్తే బిల్లు అదే నడుచుకుంటూ వస్తుందని కవిత అన్నారు. నేను జనం బాటకు వస్తున్నానని.. తెలిసి మరో బీజేపీ ఎంపీ నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని కవిత అన్నారు. ఇక్కడున్న బీజేపీ ఎంపీ ఉన్నా లేనట్లేనన్నారు. గతంలో మాధవ నగర్ బ్రిడ్జి గురించి అర్వింద్ చాలా మాట్లాడారని, ఇప్పుడు రెండేళ్లవుతున్నా బ్రిడ్జి పనుల్లో పురోగతి లేదన్నారు. గతంలో కే ట్యాక్స్ నడుస్తుందని ఆరోపణలు చేశారని గుర్తు చేసిన కవిత, మరి ఇప్పుడు మీ ట్యాక్స్ నడుస్తుందా? అని అర్వింద్ ను ప్రశ్నించారు. ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి తో లేదంటే మోడీతో మాట్లాడి బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలని కోరారు.
నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఓడించారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఓడించారని, వారెవరో జనాలకు అందరికీ తెలుసన్నారు. నాతో కొత్తగా పార్టీ పెట్టించేందుకే వ్యూహాత్మకంగా కేసీఆర్ నన్ను బయటకు పంపారనడం అర్థ రహితమని, ఆ అవసరం కేసీఆర్ కు లేదని కవిత అన్నారు. అలాంటిదేమైనా ఉంటే ఆయనే స్వయంగా మీడియా ముందు చెబుతారన్నారు. కేసీఆర్ నైనా, బీఆర్ఎస్ నైనా ఇష్యూ బేస్డ్ గానే విమర్శిస్తానని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అన్నారు. మనం ఎన్నో విప్లవాలను చూశామని, వాటిలో కొన్ని మాత్రమే గమ్యాన్ని ముద్దాడాయన్నారు. దానిలో స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన ఫ్రెంచ్ ఉద్యమం, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చిన తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందన్నారు.
ఫీజు రియంబర్స్ మెంట్ లేక ఆడపిల్లల చదువులు ఆగిపోతున్నాయి..
ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు నష్టపోతున్నారని, ఫీజుల కట్టలేక పేద తల్లిదండ్రులు ఆడపిల్లల చదువును మధ్యలోనే మానేయిస్తున్నారని కవిత అన్నారు. ఫీజు కట్టాల్సి వస్తే తల్లితండ్రులు మగ పిల్లలకు ఫీజు చెల్లిస్తున్నారే తప్ప ఆడపిల్లలకు చెల్లించలేకపోతున్నారన్నారు. ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నాడని కవిత విమర్శించారు. అందరికీ సమానావకాశాలు లేకుండా ప్రభుత్వమే అణిచి వేస్తోందన్నారు. అదే విధంగా అధికారంలో వాటా, ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాల్సిందే. అధికారంలో మహిళల వాటా 5 శాతం కూడా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదు. అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరముందని కవిత అన్నారు.
మైనార్టీ మంత్రి ఒక్కరూ లేని కాంగ్రెస్ ప్రభుత్వం
మైనార్టీల పేరు చెప్పుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ మంత్రి ఒక్కరు కూడా లేరని కవిత అన్నారు. మైనార్టీ మంత్రి లేని మొట్టమొదటి ప్రభుత్వమిదేనన్నారు. మైనార్టీ మంత్రి, ఎస్టీ మంత్రి లేని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నేను ఒక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసమే మాట్లాడటం లేదని, తెలంగాణలోని అందరి కోసం మాట్లాడుతున్నట్లు కవిత అన్నారు. రిజర్వేషన్లు, అవకాశాలు, ఉపాధి విషయంలో సమానత్వం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.
గ్రూప్ -1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం
గ్రూప్ 1 నియామకాల్లో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8 మంది నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు ఇచ్చారని కవిత విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశానని ఆమె అన్నారు. ఆయన సుమోటో గా కేసు విచారణ చేపట్టక పోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఆ 8 మంది గ్రూప్ -1 స్థాయిలో ఉండి 30 ఏళ్ల పాటు తెలంగాణలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందన్నారు. వారందరినీ ఆపే వరకు పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణల యువతకు జరిగిన నష్టంపై మాట్లాడతామన్నారు.
బీఆర్ఎస్ కు నష్టం వారితోనే..
బీఆర్ఎస్ లో బాధ్యతను మరిచిన మోసపూరిత వ్యక్తులదే పైచేయి అయ్యిందని, వారి కారణంగానే పార్టీకి బీఆర్ఎస్ కు , కేసీఆర్ కు నష్టం జరిగిందని కవిత అన్నారు. పార్టీలో ఉండగా మాట్లాడాల్సిన అన్ని చోట్లా మాట్లాడానని, కానీ పార్టీకి నష్టం చేసే వారిదే పైచేయి అయ్యిందన్నారు. నా విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ నుండి నేనసలు బయటకు రావాలని అనుకోలేదన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే బయటకు వచ్చానని, వారు కాదనుకున్న తర్వాతే పార్టీకి రాజీనామా చేశానని కవిత పేర్కొన్నారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు తెలియని తెలంగాణ కాదు. నా బాధ ప్రజలకు చెబుతా. వాళ్ల బాధ వింటా. పరిష్కార మార్గానికి ప్రయత్నం చేస్తానని కవిత అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము ఎలాంటి స్టాండ్ తీసుకోలేదన్నరు. స్థానిక జాగృతి కార్యకర్తలు ఏ పార్టీ ఓటు వేయాలన్నది వారే నిర్ణయం తీసుకుంటారన్నారు.
పోడు రైతులకు పట్టాలివ్వాలి..
అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని కవిత ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మంచిప్ప ప్రాజెక్ట్ ను కట్టబోమని రేవంత్ రెడ్డి చెప్పారని, అక్కడి పోడు రైతులకు పట్టాలు కూడా ఇస్తానని అన్నారని వెంటనే పోడు రైతులకు పట్టాలివ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంటను ఫారెస్ట్ అధికారులు విషం చల్లి పాడు చేశారని, దీంతో ఒక రైతు అదే విషంతో ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. మూడు ఎకరాల్లో పంట వేసిన ఆ రైతుకు ఎంత పెట్టుబడి అయ్యి ఉంటుందో ఆలోచించాలన్నారు. పోడు రైతుల విషయంలో సంయమనం పాటించాలని ఫారెస్ట్ అధికారులకు కలెక్టర్ చెప్పాలన్నారు. మంచిప్ప ప్రాజెక్ట్ కట్టకపోతే అక్కడి రైతులకు వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వండన్నారు. అంతేకానీ ఇలా రైతులకు అన్యాయం చేయటం ప్రభుత్వానికి తగదని, అది మానవత్వం అనిపించుకోదని కవిత అన్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతం యంచ గ్రామంలోని పొలాలను కవిత పరిశీలించానని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతులు చాలా నష్టపోయారని ఆమె పేర్కొన్నారు. రైతులంతా మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మంత్రి తుమ్మల సహా కలెక్టర్ ది కూడా తప్పు అంటున్నారన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదు. రైతులకు అండగా ఉండాల్సిన సమయమని కవిత అన్నారు.






