- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి : నరేందర్ రెడ్డి
దిశ, రాజంపేట : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి. ఆదివారం

దిశ, రాజంపేట : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి. ఆదివారం రాజంపేట మండలం శివాయిపల్లి రెడ్డి సంఘంలో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజంపేట మండల ఎన్నికల ఇన్చార్జిగా ఆయన వచ్చారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్లను కైవసం చేసుకోవాలని సూచించారు. పార్టీ బలపరిచిన ఏ అభ్యర్థికి టికెట్ వచ్చిన అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి టికెట్ వచ్చిన అభ్యర్థికి సపోర్ట్ చేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఒకర వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలతో మమేకమై ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తకు తప్పకుండా పార్టీ నుంచి టిక్కెట్ వస్తుందని తెలియజేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని.. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని, ప్రతి పౌరుడు బిజెపి వైపు చూస్తున్నాడని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.






