పేరుకే పెద్దాసుపత్రి.. అధికారుల పర్యవేక్షణ కరువు

by Ratna Kumari |   (  Updated:2025-11-09 11:03:24  IST  )

పేరుకే పెద్దాసుపత్రి.. అధికారుల పర్యవేక్షణ కరువు
X

దిశ, బాన్సువాడ : ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్నతస్థానంలో వెళ్ళి ఎన్నో అవార్డుల తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఆసుపత్రికి నేడు పర్యవేక్షణ లేక ఆదరణ కరువైంది.స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా,స్పీకర్ గా ఉన్న సమయంలో వంద పడకలుగా అభివృద్ధి చేసి అలాగే ఎదురుగా ఉన్న (ఐ.సి. డి.ఎం.ఏస్) స్థలం లోనూతనంగా మాత శిశు ఆసుపత్రి మంజూరు చేయించడంతో పాటు సిబ్బంది కొరతలేకుండ చూశారు.బాన్సువాడ డివిజన్ ప్రజలేకాకుండా, సరిహద్దు రాష్ట్రాల ప్రజలు మహారాష్ట్ర కర్ణాటక కు చెందిన రోగులు ఈ ఆసుపత్రికి చికిత్సలకు వస్తుంటారు. ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న ఆసుపత్రి నేడు అధికారుల పర్యవేక్షణ లేక పారిశుద్య సమస్య, సిబ్బంది సమయపాలన లేక నిర్లక్ష్యానికి గురవుతున్నది,ఆసుపత్రి సుప్రీండెంట్ కు ఇంకో అదనపు బాధ్యతలు ఉండడం తో సరైన పర్యవేక్షణ లేక ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురౌతున్నారు.


వంద పడకల ఆసుపత్రి శిథిలావస్థకు చేరడం తో నూతనంగా నిర్మాణం కొనసాగుతుంది. అక్కడి నుండి ఎదురుగా ఉన్న మాత శిశు ఆసుపత్రి ఆవరణలో పెద్ద షెడ్ ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నారు. అక్కడే ఎదురుగా చెత్త ట్రాక్టర్ లో చెత్త ను నింపి ప్రతిరోజూ ఖాళీ చేయాల్సి ఉండగా 5,6 రోజులనుండి ఆ చెత్త ఖాళీ చేయకుండా రెండు ఆసుపత్రులకు చెంది ఆ చెత్త ట్రాక్టర్లో కింద పారేస్తున్నారు అక్కడే రోగులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు రోగాలు తగ్గకుండా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఐనప్పటికీ అధికార లు ఏమి పట్టనట్లు ఉంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.కిందిస్తాయి సిబ్బంది సెక్యూరిటీ శానిటేషన్ వర్కర్లు సరిగా విధులు నిర్వహించక పోగా ఆసుపత్రికి వచ్చే రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే గతకొన్ని రోజుల క్రితం బ్లడ్ బ్యాంక్ లో పాము ప్రత్యక్షం అవడం తో పట్టుకుని చంపేశారు.కానీ పిచ్చి మొక్కలు అలగే పెరిగి పాములకు ఆవాసంగా ఉన్నవి.చిన్న పాటి వర్షానికి బుర్దమయంగా మారుతుందని అధికారులు స్పందించి చెత్తను ఎప్పటికప్పుడు అక్కడవేయకుండా,వర్షానికి బురదకకుండా చూడలని అధికారుల పర్యవేక్షణ ఉంటే సిబ్బంది డాక్టర్లు సమయ పాలన పాటిస్తారని ఆవిధంగా ఉన్నత అధికారులు చర్యలో చేపట్టాలని అసుపత్రికి వచ్చే రోగులు ప్రజలు కోరుతున్నారు.

Next Story