- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ దీను సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దిశ, బిచ్కుంద (నిజాంసాగర్ ) : కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ దీను సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బిచ్కుందలోని తన అద్దె ఇంట్లో ఫిర్యాదుడి నుంచి అధికారిక సహాయం పేరుతో ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకున్నారు. గ్రామాల నుంచి కల్లు దుకాణాలు తరలించేలా ఒత్తిడి చేయకుండా ఉండేందుకు, మరిన్ని కేసులు నమోదు చేయకుండా కల్లు దుకాణాలు యథావిధిగా నడిచేలా చూస్తానని చెప్పి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. తనిఖీల్లో అతని బ్యాగులో లెక్కల్లో చూపని రూ.45,760 నగదు కూడా లభ్యమైంది అని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ
నిందిత అధికారిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని హైదరాబాద్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ SPE & ACB కేసెస్ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచారు.
లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి : ఏసీబీ
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ పేర్కొన్నారు.






