భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గ్రామ‌ పాలన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గ్రామ‌ పాలన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీ.పీ.ఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా క్లస్టర్ల వారీగా భూభారతి పెండింగ్ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు జీ.పీ.ఓలకు అందించారా అని ఆరా తీశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ జరపాలని కలెక్టర్ సూచించారు. భూభారతి చట్టంలోని అన్ని మాడ్యుల్స్ పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఆర్జీలను త్వరగా పరిష్కరించగల్గుతారని అన్నారు. సాదాబైనమా, పీ.ఓ.టీ లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను కూడా పూర్తి చేయాలని సూచించారు. భూ వివాదాలు, ఇబ్బందులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని గుర్తు చేశారు. అర్జీలను త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో జీ.పీ.ఓ లు కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆయా క్లస్టర్ల గ్రామ పాలన అధికారులు పాల్గొన్నారు.

Next Story