చైన్ స్నాచింగ్ ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

by Ratna Kumari |

చైన్ స్నాచింగ్ ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఎస్సై బి. రాము సూచించారు.

చైన్ స్నాచింగ్ ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి
X
దిశ‌, మోర్తాడ్ : చైన్ స్నాచింగ్ ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఎస్సై బి. రాము సూచించారు. మంగ‌ళ‌వారం మోర్తాడ్ ఎస్.ఐ. బి. రాము సుంకేట్ గ్రామంలో ఉపాధి హామీ ప‌నులు జ‌రిగే ప్ర‌దేశాన్ని సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా వెళ్లేటప్పుడు మెడలో బంగారు ఆభరణాలు ధరించవద్దని చైన్ స్నాచింగ్ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.​ అనంతరం మన ఊరు - మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు.​ మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వకూడదన్నారు. ​పిల్లలు ఫోన్లలో అతిగా మాట్లాడకుండా చూసుకోవాలన్నారు.​ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా వారి నడవడికను ప్రతిరోజూ గమనించాలన్నారు.​ పిల్లల భవిష్యత్తు చెడిపోకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకేట్ గ్రామ ఉప సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎం.సీ. గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రామ వీడీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Next Story