- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
దిశ, భిక్కనూరు : ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ ఫ్రీ ఇండియా వ్యవస్థాపకు

దిశ, భిక్కనూరు : ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ ఫ్రీ ఇండియా వ్యవస్థాపకులు, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. శనివారం తన స్వగ్రామమైన భిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెరిగే విధంగా తొందర్లోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ టెస్ట్ లో ఎంపికైన విద్యార్థులను జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ( ఎన్ ఆర్ ఎస్ సీ ) సందర్శనకు తీసుకెళ్తానన్నా రు. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్ర సాంకేతిక పట్ల విద్యార్థులకు మంచి అవగాహన కలుగుతుందని, అంతేకాకుండా భవిష్యత్తు పై స్పష్టత కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవాని, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉమ, శ్రీమతి, ప్రసన్న, నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, తమ్మల రాజు పాల్గొన్నారు.






