- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ హయాంలో బాన్సువాడకు మున్సిపాలిటీ హోదా
బీఆర్ఎస్ హయాంలో బాన్సువాడకు మున్సిపాలిటీ హోదా లభించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో శనివారం నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

దిశ, బాన్సువాడ : బీఆర్ఎస్ హయాంలో బాన్సువాడకు మున్సిపాలిటీ హోదా లభించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో శనివారం నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ బాన్సువాడ అభివృద్ధి కోసం రూ.625 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో బాన్సువాడ కు మున్సిపాలిటీ హోదా కల్పించానని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టించడానికి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని.. ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యారని మండిపడ్డారు. ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పిన పోచారం కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపించారు. బాన్సువాడ అభివృద్ధికి కేసీఆర్ రూ.10వేల కోట్లు ఇచ్చారని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు ఒకటి కూడా సరిగా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
రెండువేల పింఛన్ నాలుగు వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పారన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం రూ. 2500/₹ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెపుతారని అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కిట్లు కనుమరుగయ్యాయని తెలిపారు. అలాగే తులం బంగారం, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బాన్సువాడలో గులాబీ జెండా ఎగురవేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,అంజిరెడ్డి, జుబేర్,ధర్మ తేజ,నార్ల రత్నకుమార్, ఎలమంచిలి శ్రీనివాసరావు,బోడ చందర్, మోచి గణేష్, సాయిబాబా,అక్బర్ పాల్గొన్నారు.






