స్వీయ జనగణన పరిశీలించిన ఎంపీడీవో బాలకృష్ణ

by Ratna Kumari |

జనగణన కార్యక్రమంలో భాగంగా రాజంపేట మండల కేంద్రంలో జరుగుతున్న స్వీయ గణనను మంగళవారం ఎంపీడీవో బాలకృష్ణ మండల ప్రత్యేక అధికారి అపర్ణతో కలిసి పరిశీలించారు.

స్వీయ జనగణన పరిశీలించిన ఎంపీడీవో బాలకృష్ణ
X

దిశ, రాజంపేట్ : జనగణన కార్యక్రమంలో భాగంగా రాజంపేట మండల కేంద్రంలో జరుగుతున్న స్వీయ గణనను మంగళవారం ఎంపీడీవో బాలకృష్ణ మండల ప్రత్యేక అధికారి అపర్ణతో కలిసి పరిశీలించారు. మండల కేంద్రంలో స్వయంగా తిరుగుతూ స్వీయ గణనను విధానాన్ని పరిశీలిస్తూ, ప్రజలకు దీని ప్రాధాన్యత వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాలకృష్ణ మాట్లాడుతూ వివరాలను సరిగ్గా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లు కు సూచించారు.డిజిటల్ విధానంలో వివరాలు నమోదు చేయడం ద్వారా సమయం ఆదా అవుతుందని తెలిపారు. ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకున్న వారు తమ యూనిక్ ఐడీ నంబర్‌ను ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు కు చూపించాలని సూచించారు. స్వీయ గణన నమోదు చేసినప్పుడు ఎవరైనా ఏదైనా తప్పుగా ఎంట్రీ చేస్తే ఎన్యుమరేటర్లు కు చెబితే ఎడిట్ ద్వారా సరిచేస్తారని ఆయన వివరించారు.

Next Story