- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి బంద్ విజయవంతం చేయాలి బాజీరెడ్డి గోవర్ధన్
దిశ, బాన్సువాడ : బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు నిర్వహించే రాష్ట్ర బంద్ ని విజయవంతం చేయాలని బాజీరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్ని మండల కేంద్రంలో ఆయన

దిశ, బాన్సువాడ : బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు నిర్వహించే రాష్ట్ర బంద్ ని విజయవంతం చేయాలని బాజీరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్ని మండల కేంద్రంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ది లేదన్నారు. ఒకవేళ అలా ఉంటే అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లేవాడని, కోర్టులో ఇది నిలవదని తెలిసి బీసీలతో ఆడుకున్నాడని పేర్కొన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి సుప్రీంకోర్టుకు వెల్లాడని తెలిపారు. ఎన్నికల్లో హామీలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి అమలు చేయని ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. అఖిలపక్షాన్ని ప్రధాని దగ్గర తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లకుండా తమ మంత్రులను, ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తే అధి నాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మద్దతు పొందలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని దుయ్య బట్టారు.బీసీ బంద్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పాల్గొంటానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, ఎంపీపీ శ్రీనివాస్ రావు, తెల్ల రవి కుమార్, ఆనంద్ పాల్గొన్నారు.






