మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌ఓగా రాము బాధ్యతల స్వీకరణ

by Bhanu |

మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు బి. రాము నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌ఓగా రాము బాధ్యతల స్వీకరణ
X

దిశ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు బి. రాము నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఏరుగట్ల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన రాము, ఇప్పుడు మోర్తాడ్ ప్రాంత ప్రజలకు సేవలందించడానికి ముందుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, న్యాయ వ్యవస్థ పటిష్టత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సమయానికి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని, పోలీసులపై నమ్మకాన్ని మరింత బలపరిచే విధంగా పని చేస్తానని తెలిపారు.


Next Story