ఆయిల్ ఫామ్ పంటపై అవగహన సదస్సు

by velandi.Saikiran |

పలు రకాల సబ్సిడీలతో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని వ్యవసాయ అధికారి రమ్యశ్రీ అన్నారు.

ఆయిల్ ఫామ్ పంటపై అవగహన సదస్సు
X

దిశ, కమ్మర్ పల్లి : పలు రకాల సబ్సిడీలతో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని వ్యవసాయ అధికారి రమ్యశ్రీ అన్నారు. మండలంలోని చౌటుపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సదస్సులో రైతులకు హార్టికల్చర్ ఆఫీసర్ రాజు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పద్మ లతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30 సంవత్సరాల పాటు ఇస్తుందని పేర్కొన్నారు. కోతులు, పందులు, దొంగల బెడద లేని తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90% రాయితీ, SC/ST రైతులైతే 100% రాయితీ, 5 ఎకరాల మీద సాగు చేసేవారు 80% రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ జి.నాగేష్ గౌడ్, అలానే గ్రామ ప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Next Story