- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు ఎరువుల కొరత నివారించండి.. గల్ఫ్ కార్మికులను ఆదుకోండి
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ లో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.

దిశ, ఆర్మూర్ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ లో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. "దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతను నివారించడని, గల్ఫ్ కార్మికులను ఆదుకోండి" అని దేశంలోని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో జరిగిన ఫైనాన్స్ బిల్లు (Finance Bill) చర్చలో భాగంగా రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి పాల్గొని, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, రైతాంగ సవాళ్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై గలమెత్తారు. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సురేష్ రెడ్డి కోరారు. ఖరీఫ్ సీజన్ - ఎరువుల గురించి,రాబోయే మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో,రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని సురేష్ రెడ్డి కోరారు.
యూరియా తయారీకి అవసరమైన గ్యాస్ కోసం మనం 90% విదేశాలపైనే ఆధారపడు తున్నామని, గల్ఫ్ దేశాల్లోని ఉద్రిక్తతల వల్ల సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందని సూచించారు. గత ఏడాది తెలంగాణలో యూరియా కొరత వల్ల రైతులు ఎదుర్కొన్న లాఠీ చార్జ్ వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఎరువుల పంపిణీ పై రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేంద్రీయ ఎరువులు - 'మిషన్ మోడ్' ప్రాజెక్ట్: ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పట్టణాల్లో ఏటా ఉత్పత్తి అయ్యే 30 మిలియన్ టన్నుల తడి వ్యర్థాలను (Wet Waste) శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి సేంద్రీయ ఎరువులుగా మార్చాలని, దీనిని UPI తరహాలో ఒక విప్లవాత్మక 'మిషన్ మోడ్' ప్రాజెక్ట్‌గా చేపట్టాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇది మట్టి సారాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
రాజకీయాల్లో జవాబు దారీతనం తీసుకురావడానికి ఎన్నికల హామీలను చట్టబద్ధం చేయాలని ఆయన ప్రతిపాదించారు.తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య బలోపేతానికి దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టం అవసరమని స్పష్టం చేశారు.గల్ఫ్ కార్మికుల సమస్యలు: గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయులు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన కార్మికుల సంక్షేమంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని, ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించా లని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను సమన్వయం చేయాలని సురేష్ రెడ్డి కోరారు.






