ఆటో బోల్తా.. ఇద్ద‌రు చిన్నారుల‌కు గాయాలు

by Ratna Kumari |

సదాశివ నగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పై లక్ష్య‌ గార్డెన్ స‌మీపంలో ఉదయం ఆటో బోల్తా పడింది.

ఆటో బోల్తా.. ఇద్ద‌రు చిన్నారుల‌కు గాయాలు
X

దిశ, సదాశివ నగర్ : సదాశివ నగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పై లక్ష్య‌ గార్డెన్ స‌మీపంలో ఉదయం ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. రంజాన్ పండుగ సందర్భంగా కల్వరాల్ గ్రామం కు చెందిన ఓకే కుటుంబం. రంజాన్ పండుగ కోసం జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న‌ట్టు సదాశివ నగర్ ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలు అయిన‌ట్టు సమాచారం తెలుసుకున్న సదాశివ నగర్ సర్పంచ్ వంకాయల శిరీష, రవి చేరుకొని హైవే అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు హుటా హుటిన చేరుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు.

Next Story